మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్, నమ్రత!

Namrata Shirodkar: చాలా సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ తమ దాన గుణాన్ని బయట పెట్టారు. ఈసారి వీళ్లు చేసిన మంచి పని ఏంటంటే..
మహేష్, నమ్రత పసి పిల్లల కోసం మదర్స్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు.ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ఎంబీ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.తల్లి పాలు అందని వారికి, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఈ ఫౌండేషన్ ద్వారా పాలు అందిస్తామని నమ్రత తెలిపారు. పాలు ఎక్కువగా ఉన్న తల్లుల నుంచి పాలను సేకరించి, వాటిని అవసరమైన వారికి అందచేయనున్నామని, తల్లి పాల వల్ల పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటూ ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని నమ్రత తెలిపారు.
దీంతో పటూ సర్వికల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ఎంబీ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు నమత్ర వెల్లడించారు. ఈ రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ సమస్య చాలా మందికి తీవ్ర సమస్యగా మారిందని, ముందే దానికి వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, 9 నుంచి 18 ఏళ్ల బాలికలకు దీన్ని అందించాలనుకుంటున్నామని, 2025 చివరి నాటికి 1500 మంది బాలికలకు టీకాలు వేయడమే తమ లక్ష్యమని నమ్రత తెలిపారు. సూపర్ స్టార్ మహేష్, నమ్రత చేస్తున్న ఈ మంచి పనికి వారిని మరోసారి అందరూ అభినందిస్తున్నారు.
https://www.instagram.com/p/DHSjvY7I6HX/?igsh=MTFsMGwzdDVjZnJlYg==