Nara Lokesh: గెలవాలి అన్న పట్టుదలతో కష్టపడ్డా
Nara Lokesh: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేశ్ మాట్లాడారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని.. మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మంగళగిరిలో 2019లో నేను ఓడిపోయాను. కానీ పట్టుదలతో శ్రమించి రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచానని అన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజం. పరీక్షలు తప్పినందుకే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలన్నారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నారా లోకేష్ అన్నారు.