నాని తో పూజా రొమాన్స్?

Nani: నాచురల్ స్టార్ నాని సరసన పూజా హెగ్డే నటిస్తుంది. సుజీత్ దర్శకత్వంలో కొత్త చిత్రం సంచలనం సృష్టిస్తుంది. ఈ కాంబో స్క్రీన్‌పై ఎలా సెటవుతుంది. స్టైలిష్ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూద్దాం.
పూజా హెగ్డే వరుస డిజాస్టర్ల తర్వాత సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. నానితో సుజీత్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ కామెడీ చిత్రంలో నటిస్తుంది. నాని ఎప్పుడు సాధారణ హీరోయిన్లను ఎంచుకుంటాడ. కానీ పూజా గ్లామర్ ఇమేజ్ ఎప్పుడు పెద్ద స్టార్ హీరోలతోనే సెట్టవుతుంది. అయితే విభిన్న ఇమేజ్‌లు కలిస్తే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది.
అందుకే ఈ కాంబో ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సుజీత్ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో ఈ చిత్రం రాబోతోంది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ స్టార్టవుతుంది. ఈ రూమర్ నిజమైతే కొత్త రిఫ్రెషింగ్ కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈ జోడీ హిట్ కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.



