సినిమా
The Paradise Glimpse: కడుపు మండిన కాకి కథ.. నాని 'ప్యారడైజ్' గ్లింప్స్ విడుదల

The Paradise Glimpse: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో తాజా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను చిత్రం బృందం విడుదల చేశారు. చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాసి ఉంటారు గానీ, కానీ అదే జాతిలో కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.



