News

Bigg Boss Telugu: బిగ్ బాస్ 9కి బాలయ్య హోస్ట్.. టీఆర్పీల సునామీ రెడీనా?

Bigg Boss Telugu: నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలో టాక్ షోతో హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్‌గా గేర్ మార్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆయన మాస్ హోస్టింగ్ స్టైల్‌తో కంటెస్టెంట్స్‌ని కంట్రోల్ చేస్తే షో రేంజ్ మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ‘అఖండ 2’తో బిజీగా ఉన్న బాలయ్య ఈ ఆఫర్‌పై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.

అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, బుల్లితెరపై బాలయ్య మ్యాజిక్ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. గతంలో నాగార్జున హోస్ట్‌గా విజయవంతంగా నడిపిన ఈ షోలో బాలయ్య ఎంట్రీతో కొత్త ఊపు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button