ఆంధ్ర ప్రదేశ్
నాగార్జునసాగర్ కుడి కాలువ కట్టకు గండి

పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడికాలువ గండి పడింది. పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో స్నానం ఆచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి వేళ కట్టను ధ్వంసం చేశారు.
కాలువకు గండి పడటంతో నీటి ఉధృతి ఎక్కువ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.



