తెలంగాణ
Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. 18 గేట్లు ఎత్తి నీరు విడుదల

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి నీరు పోటెత్తుతుండడంతో 18 గేట్లు ఎత్తారు అధికారులు. కాగా ప్రస్తుతం నీటినిల్వ 307 టీఎంసీల కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 2 లక్షల 52 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2 లక్షల 92 వేల క్యూసెక్కుల నీటి నిల్వ ఉంది. అయితే ప్రాజక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.



