తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తుంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వస్తున్న లక్షా 20 వేల క్యూసెక్కుల వరద నీటిని అదేస్థాయిలో సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2007 తర్వాత జులై నెలలో గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి. నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 584 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. 312 టీఎసంసీల నీటి నిల్వలకు ప్రస్తుతం 294 టీఎంసీల నీరు నిల్వ ఉంది.