క్రీడలు
BCCI: ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ బౌలర్ ఔట్

BCCI: ఐపీఎల్ 2026 సీజన్ ముందే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింస్మతక ఘటనలు, మత అల్లర్ల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ముస్తాఫిజుర్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇకపోతే డిసెంబర్ 2025లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ ముస్తఫిజుర్‌ను 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ముస్తఫిజుర్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది.



