తెలంగాణ
నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం

నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్-2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7 వేల 360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు.
ఉస్మాన్‌సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40 శాతం కాగా కాంట్రాక్టు కంపెనీ 60 శాతం నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు.



