రామ్ చరణ్ “పెద్ది”లో మున్నా భయ్యా మాస్ లుక్ వైరల్!

PEDDI: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న “పెద్ది” సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది. మీర్జాపూర్ ఫేమ్ దివ్యెందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” చిత్రం సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేపుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మీర్జాపూర్ సిరీస్‌తో ఫేమస్ అయిన దివ్యెందు శర్మ ఈ సినిమాలో రామ్ బుజ్జి పాత్రలో కనిపించనున్నారు.
ఆయన బర్త్‌డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో దివ్యెందు క్రికెట్ బాల్‌తో మాస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. 2026 మార్చ్ 27న “పెద్ది” గ్రాండ్‌గా విడుదల కానుంది.