జాతియం

400 కిలోల RDX, 34 కార్లు.. కోటి మంది లక్ష్యం.. ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర..?

Mumbai: పుల్వామా ఉగ్రదాడి. ఆ సంఘటన ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆ రోజు జరిగిన ఉగ్రదాడి దేశం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ దుర్ఘటన చూసి యావత్ దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కరు కాద. ఇద్దరు కాదు 40 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఆత్మహుతి దాడితో దేశ రక్షకులను సమాధి చేశారు. విధ్వంసాన్ని దృష్టించారు. ముక్కలు ముక్కులుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను చూసిన వారి కన్నీళ్లు ఏరులై ప్రవహించింది.

ఇప్పుడు మళ్లీ అదే జరగబోతుందంటూ మహానగరానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. 14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్ 34 వాహనాల్లో బాంబులు అమర్చామ‌ని బెదిరింపులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. కోటి మంది లక్ష్యంతో ఉన్నట్లు సందేశాన్ని పంపారు. ఇంతకీ బాంబులను ఎక్కడ అమర్చారు..? నిజంగా ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర జరుగుతోందా..? ఉగ్రవాదుల బెదిరింపులకు మోదీ సర్కార్ ఏలా కౌంటర్ ఇస్తుంది..?

నడిచేది ఒకరు నడిపించేది మరొకరు ఒకరు పాత్రధారి ఆ పాత్రధారి వెనుక అసలు సూత్రధారి..! పాకిస్థాన్ తంత్రం ఇదేనా..? భారత్‌పై ఈ కుతంత్రాన్నే పఠిస్తుందా..? అంటే దీనికి అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా భారత్‌పై మరో భారీ కుట్రకు తెరతీసింది. ముంబై మహానగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్‌కు వచ్చిన ఒక సంచలనాత్మక ఫోన్ కాల్ మహానగరాన్ని భయాందోళనకు గురి చేసింది. కాల్ చేసిన వ్యక్తి మొత్తం 34 కార్లలో 400 కిలోల ఆర్డీఎక్స్‌తో నిండిన 34 మానవ బాంబులు ఉన్నాయని అవి నగరాన్ని పూర్తిగా నాశనం చేసేలా భారీ పేలుళ్లకు సిద్ధంగా ఉన్నాయని బెదిరించాడు. ఈ సమాచారంతో ముంబై పోలీసులు వెంటనే అప్రమత్తమై ముంబైలో హై-అలర్ట్ ప్రకటించారు.

ముఖ్యంగా గణేష్ ఉత్సవాల నిమ‌జ్జ‌నం సందడిలో ఉన్న‌ తరుణంలో ఈ సందేశం పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ బెదిరింపు మెసేజ్‌పై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. క్రైమ్ బ్రాంచ్ నుండి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వరకు అన్ని ఏజెన్సీలు ఈ విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మెసేజ్‌లో లష్కరే జిహాదీ అనే సంస్థ పేరు కూడా కనిపించింది.

ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత్ చతుర్దశి నాడు రావడం ఆందోళన కలిగించింది. 34 కార్లలో మానవ బాంబులు పేలితే కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు సందేశంలో ఉంది. ఈ బెదిరింపు కాల్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచారు. ఆ సంస్థ, సందేశం పంపిన వ్యక్తి గురించి పోలీసులు వెతుకుతున్నారు.

నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో గణేష్ నిమజ్జనాలు జరగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతా బలగాలను కూడా అధికంగా మోహరించారు. అలాగే డాగ్ స్క్వాడ్‌లను అధికారులు ఉంచారు. అనుమానం వచ్చిన ప్రతీ దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన పర్యాటక ప్రదేశాలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్ల గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ప్రజలకు నగరంలో ఎక్కడైనా అనుమానస్పదంగా కదలికలు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు తెలిపారు.

అయితే ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి తప్పుడు బెదిరింపులు ముంబైకి కొత్తేమీ కాదు. గత కొద్ది నెలలుగా ఇలాంటి ఘటనలు చాలానే నమోదయ్యాయి. ఈ నివేదికలు నగర భద్రతకు ఒక సవాలుగా మారాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక రైల్వే స్టేషన్ ను పేల్చివేస్తానని బెదిరించినందుకు రూపేష్ మధుకర్ రాంపిసే అనే 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతను పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, కల్వా రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టానని చెప్పాడు. కానీ తనిఖీల తర్వాత అది ఒక తప్పుడు సమాచారమని తేలింది.

ఇదిలా ఉండగా ఇటీవల పట్నాలోని సివిల్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపుల మెయిల్ వచ్చింది. జైషే మహ్మద్‌కి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు బిహార్‌లోకి ప్రవేశించారు. దీంతో వెంటనే బిహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను కూడా విడుదల చేశారు. దీంతో రాష్ట్రమంతా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ఉగ్రవాదులు నేపాల్‌ మీదుగా బిహార్‌ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇది ఒక ఫేక్ ఈమెయిల్ అని తర్వాత నిర్ధారించారు.

దీంతో సందేశంలో పేర్కొన్న లష్కరే జిహాదీ గురించి వెతికే పనిలో పడ్డారు. కానీ దాని గురించి పెద్దగా సమాచారం లేదు. ఇది నిజమైన సంస్థనా లేక ఎవరైనా బెదిరించేందుకే ఈ పేరు పెట్టారా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ పోలీసులు మాత్రం మూల మూలన వెతుకుతున్నారు. ఎందుకంటే పుల్వామా దాడి యావత్తు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2019 ఫిబ్రవరి 14 ప్రపంచం అంతా ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటోంది.

చిగురించిన ప్రేమను పంచుకున్న కోట్లాది మనసులు ఉల్లాసంగా ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే పనిలో తలమునకలై ఉన్నాయి. భారత జవాన్లు మాత్రం దేశ ర‌‌క్షణలో మునిగి ఉన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దు వద్ద పహారా కాస్తూనే ఉన్నారు. ఎక్కడ మాయ చేసి వచ్చారో కానీ ముష్కరులు జమ్ము కశ్మీర్ జిల్లా పుల్వామాలో విరుచుకుపడ్డారు. CRPF జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేసారు.

అది జమ్ము శ్రీనగర్ హైవే సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు CRPF జవాన్లు బయలు దేరారు.కాన్వాయ్ అవంతిపురా కు చేరుకోగానే మాయదారి ముష్కురులు పంజా విసిరారు. పాక్ ప్రేరేపిత జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు సూసైడ్ బాంబర్లుగా మారి, కాన్వాయ్ ను ఢీకొట్టారు.

ది మోస్ట్ వాంటెడ్, ది మోస్ట్ నొటోరియస్ టెర్రరిస్ట్ ఆదిల్ అహ్మద్ దార్ చేసిన ఘాతుకం ఇది. కాన్వాయ్ అవంతిపురకు చేరుకోగానే అప్పటికే పేలుడు పదార్ధాలు నింపి ఉన్న ట్రక్కుతో కాన్వాయ్ ను ఢీ కొట్టాడు. 78 వాహనాలు ఉన్న కాన్వాయ్ లో 5వ వాహనం ముక్కలు ముక్కలైంది.

సరిగ్గా సాయంత్రం 4గంటలు పడమర ఒడిలోకి ఒదిగిపోయేందుకు సూర్యుడు సమాయత్తమవుతున్నాడు. నారింజ రంగు వర్ణాన్ని పులుముకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పుల్వామాలో జరిగిన దాడితో సూరీడిపై నెత్తుటి కళ్లాపీ జల్లినట్లు అయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జవాన్ల దేహాలు తెగిపడ్డాయి. ముక్కలు ముక్కలుగా మారి మాంసపు ముద్దలుగా దర్శనమిచ్చాయి. ఆర్తనాలు ఆకాశాన్ని అంటాయి.

మొత్తం 40మంది CRPF జవాన్లు బలయ్యారు. దేశం మొత్తం శోక సంద్రాల్లో మునిగిపోయింది. విషాదమేఘాలు కమ్ముకున్నాయి. అమరుల కుటుంబాలు అనుభవించిన శోకానికి అంతులేదు. మాంసపు ముద్దలుగా మారిన జవాన్ల దేహాలను చూసి ప్రజలు చలించిపోయారు. ఆ తర్వాత సైనిక బలగాలు పాపాల పాక్ కు గట్టి గుణపాఠమే చెప్పారు. అఖండ భారత్ సత్తా చాటారు.

అందుకే ముంబైలో ఆత్మహుతి దాడి అంటూ అందరూ భయపడుతున్నారు. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కోట్ల మంది జీవిస్తూ ఉంటారు. అక్కడ 400 కిలోల ఆర్డీఎక్స్ 34 వాహనాల్లో బాంబులు అంటే మహానగరం విధ్వంసం అవ్వక తప్పదు. ఎంత మంది చనిపోతారో ఎన్ని శవాల కుప్పలు కనిపిస్తోయో తెలియదు అందుకే కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. బాంబులు పెట్టి పేల్చుతామంటూ ఊరుకుంటామా అంటూ ఉగ్రమూఖలను వేతికేపనిలో పడింది. ఉగ్రనాగులను కూకటివేళ్లతో పేకిలేసేపనిలో పడింది భారత్ సైన్యం.

ఉగ్రవాదాన్ని దన్నుగా చేసుకునే సాగుతున్న పాకిస్థాన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని భారత్‌తోపాటు ఇతర దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ పాకిస్థాన్ తన తీరును మార్చుకోలేదు. ఉగ్రవాదంతో సావాసం చేస్తూనే ఉంది.

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ఒంటరిగానే ఉంది. కనీసం అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. దేశంలో అంతర్గత పోరు ఉంది. అయినా పాకిస్థాన్ ఏ మాత్రం తలొగ్గకుండా వ్యవహరిస్తూనే ఉంది. ఇకనైనా పాక్ తన దుశ్చర్యలకు పుల్‌స్టాప్ పెట్టి జాగ్రత్తగా వ్యవహరించకపోతే సహనాన్ని పరీక్షిస్తే సమరం తప్పదని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button