Mufasa The Lion King: ఓటీటీలోకి ‘ముఫాసా – ది లయన్ కింగ్’

Mufasa The Lion King: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి చిత్రం ‘గుంటూరు కారం’ తర్వాత కొత్త సినిమాలు ఏమి లేవని ఆయన అభిమానులు నిరాశ చెందుతుండగా ఆయన పాత చిత్రాలు రీరిలీజ్‌తో అలరించాయి. అయితే, ఇప్పుడు మహేష్ ఓ కొత్త చిత్రంతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
డిస్నీ నిర్మించిన హాలీవుడ్ లైవ్ యానిమేటెడ్ చిత్రం ‘ముఫాసా – ది లయన్ కింగ్’లో మహేష్ బాబు తెలుగు వెర్షన్‌లో ముఫాసాగా డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా థియేటర్లలో పిల్లలు, పెద్దలను ఆకట్టుకుని విజయం సాధించింది.ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా, మార్చి 26 నుంచి ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
మహేష్ గాత్రంతో ముఫాసా ప్రేక్షకులను ఆకర్షించింది. థియేటర్లలో చూడని వారు జియో హాట్‌స్టార్‌లో ఈ విజువల్ వండర్‌ను ఆస్వాదించవచ్చు. మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో అందుబాటులోకి రావడంతో ఫుల్ హ్యాపీ అవుతున్నారు.