తెలంగాణ
MP Ramesh: కేటీఆర్ మీద బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

MP Ramesh: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తనకు కాంట్రాక్ట్ వచ్చిందన్న కేటీఆర్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు కాంట్రాక్టులు ఎలా వస్తాయో తెలియదా అని రమేష్ ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తే బీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవనే భయంతోనే కేటీఆర్ చవకబారు ఆరోపణలు చేస్తున్నారని రమేష్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే అని మాట్లాడటం కేటీఆర్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ఏపీ బీజేపీ నేత ఎద్దేవా చేశారు.