తెలంగాణ
MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్‌కు మద్దతు

MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. పాముకు పాలుపోసి పెంచినట్టు మతోన్మాద ఎంఐఎం పార్టీని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పెంచి పోషించాయన్నారు. ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పిలుపునీయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ పార్టీని గెలిపించడానికేనని లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్ ను కాపాడుకోవడానికి ఓటర్లు మనస్సాక్షిగా ఓటేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.