తెలంగాణ
చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వార్నింగ్

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ. ఈ నేపథ్యంలోనే స్థానిక రైతులకు చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించడం తమకు నష్టపరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు.
దీంతో స్థానిక రైతులకు నష్టపరిహారం అందించడంలో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడుతామని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని హెచ్చరించారు.



