తెలంగాణ
Sigachi: పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

Sigachi: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్‌మార్కెట్లకు ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. 3 నెలల వరకు ప్లాంట్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివేక్ కుమార్ పేర్కొన్నారు.