సినిమా
మద్యం మత్తులో మూవీ ఆర్టిస్ట్ హల్చల్.. నడిరోడ్డుపై హోంగార్డుపై దాడి

Hyderabad: యువతి మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందులేసింది. తాగి ఊగి రోడ్డుపై తైతక్కలాడింది. మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత మధురానగర్ లోని మెయిన్ రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించింది. మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్బాషపడింది. అటుగా వెళ్ళేవారిని వదలకుండా విరుచుకుపడింది.
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల విధుల్ని ఆటంకపర్చింది. న్యూసెన్స్ సృష్టించి వీరంగం చేసింది. అడ్డుకునేందుకు యత్నించిన మహిళా హోంగార్డ్ పై సైతం దాడి చేసింది. మూవి ఆర్టిస్టు సరిత ప్రవర్తననతో పోలీసులు విసిగిపోయి ఆమె భర్త రాజేష్ కు ఫోన్ చేసి పిలిపించి అప్పగించారు. మద్యం మత్తులో వీరంగం చేస్తున్న ఆమెని ఇంటికి తీసుకెళ్ళాలని భర్త రాజేష్ కు సూచించారు. సరిత పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.