తెలంగాణ
Karimnagar: దారుణం.. రూ.6 లక్షలకు శిశువు విక్రయం

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది. ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది. గన్నేరువరం మండలం చాకినివానిపల్లెకి చెందిన రాయమల్లు, లత దంపుతులు శిశువు విక్రయానికి ఆరు లక్షలకు ఒప్పందం కుదర్చుకున్నారు.
అయితే శిశువు విక్రయంపై బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశువు విక్రయానికి సహకరించిన 15 మందిని అరెస్ట్ చేసిన కరీంనగర్ టూటౌన్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.



