News

Mother Dog: తుర్కియేలో ఘటన.. శునకం కన్నప్రేమకు జనం ఫిదా..

ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏది లేదు. ఆత్మీయత, అనురాగం, అనుబంధం.. వీటిని మించి అమ్మ ప్రేమలో ఉంటుంది. తన కోసం కాకుండా తన పిల్లల కోసం సర్వస్వం చేస్తుంది. బిడ్డలపై చూపించే అమ్మ ప్రేమకు మరొకటి సరితూగదు. కన్నబిడ్డల పట్ల తల్లి చూపించే ప్రేమకు కొలమానం ఉండదు. మనుషులైనా, మూగజీవాలైనా కన్నప్రేమ విషయంలో ఎలాంటి తేడా ఉండదు. ఇది నిజమని నిరూపించే ఘటన తుర్కియేలో చోటుచేసుకుంది.

బిడ్డ ప్రాణం పోతుంటే.. ఆ తల్లి తల్లడిల్లింది. ప్రాణాపాయంలో ఉండి అచేతనంగా పడిపోయిన ఓ కుక్క పిల్లను దాని తల్లైన వీధి శునకం నోట కరిచి వర్షంలో తడుస్తూ స్థానికంగా ఓ జంతువుల ఆస్పత్రికి తీసుకొచ్చింది. తన పిల్లను అక్కడి సిబ్బంది ముందు పడేసి.. నా బిడ్డను కాపాడండి అన్నట్టు వారి వైపు దీనంగా చూసింది.

ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురైన ఆ ఆస్పత్రి సిబ్బంది.. వెంటనే తేరుకుని కొన ఊపిరితో ఉన్న ఆ పిల్లను పరీక్షించి అవసరమైన వైద్య సాయం అందించి ప్రాణాన్ని నిలిపారు. ఆస్పత్రి బల్లపై ఆ పిల్లకు చికిత్స చేస్తున్నంత సేపు తల్లి శునకం కూడా అక్కడే కంగారుగా తిరుగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా.. ఆ వీధి శునకం కన్నప్రేమకు జనం ఫిదా అయిపోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button