తెలంగాణ
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బహదూర్‌పురాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ కీర్తిక అగర్వాల్ తన రెండేళ్ల కుమార్తె బియ్యారాతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్ సమీపంలో మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, లేక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
పరిశీలనలో కీర్తిక గత ఏడాదిన్నరగా తన పుట్టింట్లోనే ఉంటోందని, భర్త పృథ్విలాల్‌తో విభేదాల కారణంగా ఇద్దరూ విడిగా ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. కూతురు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాలను గుర్తించి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.



