తెలంగాణ
మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత

హైదరాబాద్ నగర ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత పనులను ప్రారంభించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా మరోవైపు పాత బ్రిడ్జిని కూల్చివేస్తోంది జీహెచ్ఎంసీ. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీకి వచ్చిన భారీ వరదలతో మూసారాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జి కోతకు గురైంది.
బ్రిడ్జి పునరద్ధరించడం కష్టమని తేల్చిన అధికారులు బ్రిడ్జిపై రాకపోలను నిలిపివేసి కూల్చివేత పనులు చేపట్టారు. దాదాపు దశాబ్దాలపాటు దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్ రాకపోకలకు వారధిగా నిలిచిన బ్రిడ్జి ప్రాస్థానం ముగిసింది. ఇక కొత్త బ్రిడ్జి పనులను అధికారులు స్పీడప్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.



