తెలంగాణ

Azharuddin: మినిస్టర్ అజార్…మూన్నాళ్ళ ముచ్చటేనా..?

Azharuddin: ఆయనకు అనూహ్యంగా అమాత్య యోగం దక్కింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే క్యాబినెట్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు తప్పక ఎలక్ట్ కావాల్సిందే. లేదంటే మంత్రి పదవి ఊస్ట్ అవ్వడమే. ఇప్పటికే ఆయనను మండలికి పంపుతామంటూ రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ ఆయన ఎమ్మెల్సీ అవడం అంత ఈజీ కాదని..అదంతా లిటిగేషన్‌లో ఉన్న వ్యవహారమన్న టాక్ వినిపిస్తోంది.

దీంతో తెలంగాణ క్యాబినెట్ లో ఆ మంత్రికి కొత్త టెన్షన్ పట్టుకుందా..! గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి హరికృష్ణకు వచ్చిన పరిస్థితే ఆ మంత్రికి ఎదురవుతుందనే భయంలో ఉన్నారా..! అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి….! హరికృష్ణకు ఏం జరిగింది…? ఎందుకు ఈ మంత్రికి భయం పట్టుకుంది.. తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

ఇటీవలే తెలంగాణలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అలియాస్ అజ్జూ భాయ్.. ఐతే ఇప్పుడు అజ్జూ భాయ్ కి టెన్షన్ పట్టుకుందట…! అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఒక నెలన్నర దాటిపోయింది. శాసనసభ, శాసన మండలిలో సభ్యుడిగా లేకపోతే 6 నెలలలో ఏదో ఒక సభలో సభ్యుడిగా కచ్చితంగా ఎన్నికవ్వాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుంది. ఐతే ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యేగా లేరు. అలాగని ఎమ్మెల్సీగా లేరు.

శాసనసభ, శాసనమండలిలో సభ్యునిగా లేరు. ఇంకో నాలుగున్నర నెలల గడువు మాత్రమే ఉంది . ఈ లోపు ఎదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వాలి.. ఐతే ఏంటి అజారుద్దీన్ కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం పేరు సిఫార్సు చేసింది కదా..!అజారుద్దీన్ కి వచ్చిన సమస్య ఏంటని అనుకుంటున్నారా..! అజారుద్దీన్ కు పదవి గండం కూడా ఉందనే టాక్ నడుస్తోంది.

గవర్నర్ కోటలో అజారుద్దీన్, కోదండరాం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ తెలంగాణ కేబినెట్ గవర్నర్ కి పంపించింది. ఆగష్టు నెలలోనే ఈ ఫైల్ గవర్నర్ కు చేరింది. సర్కార్ పంపించిన 6 నెలలలోపు గవర్నర్ ఆమోదం అయినా తెలపాలి, లేదంటే ఏదైనా మార్పు చేర్పులు ఉంటే సూచనలు చేస్తూ తిరిగి ప్రభుత్వానికి పంపాలి. లేదా తిరస్కరించాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే గవర్నర్ కి పంపించి 4 నెలలు కావస్తుంది.

2026 ఫిబ్రవరి నెలతో 6 నెలలు పూర్తి అవుతుంది. అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు మైనారిటీ కోటాలో మంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ నెల చివర్లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2026 ఏప్రిల్ నెలతో 6 నెలల గడువు ముగుస్తుంది. ఐతే ఫిబ్రవరి నెలలోగా గవర్నర్ ఎమ్మెల్సీగా ఆమోదం తెలిపితే సరే లేదంటే అజారుద్దీన్ పదవికి గండం తప్పదని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ గవర్నర్ తిరస్కరిస్తే ఏప్రిల్ నెల ముగిసే సమయానికి అజారుద్దీన్ ని ఎదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది. అలా కాకుంటే అజారుద్దీన్ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో నందమూరి హరికృష్ణకి ఇలాగే అవకాశం కల్పించారు. రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 6 నెలలు ముగిసే వరకు నందమూరి హరికృష్ణ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ తరువాత ఎన్టీఆర్ మరణం తర్వాత హిందూపురం నియోజకవర్గ ఉపఎన్నికలో హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వరించలేదు అది వేరే విషయం. ఐతే 6 నెలలు ఏ సభలో సభ్యుడిగా లేనందువల్ల హరికృష్ణ మంత్రిపదవి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అజారుద్దీన్ కి ఇలాంటి భయమే పట్టుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది…!

ఇటీవల ఒక సందర్భంలో ఒక మంత్రి మాట్లాడుతూ అజారుద్దీన్ కచ్చితంగా మంత్రిగా కొనసాగుతారు. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందకపోతే లేదా గవర్నర్ నిర్ణయం ఆలస్యమైనా రానున్న 2026 మార్చి నెలలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవిని అజారుద్దీన్ కి ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఐతే ఇది వినడానికి బాగానే ఉన్నా అప్పటి సమయానికి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఏది ఏమైనా అజారుద్దీన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తెర పైకి వస్తోంది. చూద్దాం మరి అజ్జు భాయ్ కేబినెట్ లో కొనసాగుతారా…! లేదంటే ఆయనకు మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందా.. ! అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button