మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్!

అమెరికాను భారత్ వాడుకుంటోంది. కానీ ఇండియాను మేం వాడుకోవట్లేదు. వాళ్లు వాళ్ల వస్తువులను అమెరికాలో డంప్ చేస్తున్నారు. ఇవీ ప్రతిరోజు ట్రంప్ మాట్లాడే టెంపరి మాటలు. కానీ… రియాల్టీకి మాత్రం వేరు. అమెరికన్ కంపెనీలు భారత్‌తో వేలకోట్లు సంపాదించుకుంటున్నాయి. పైగా అమెరికాతో మనకంటే ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలను వదిలేసి ఒక్క భారత్‌నే టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. ఇంతకీ ట్రంప్ భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి..? మనకు, అమెరికాకు మధ్య ఉన్న తేడాలేంటి..? ఇప్పుడు ట్రంప్ మళ్లీ నువ్వు.. నీను జానే జిగర్ అనడానికి కారణమేంటి..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజూ పొద్దున లేసినప్పటి నుంచి మిగితా దేశాలన్నింటిని పక్కన పెట్టి ఒక్క ఇండియాపైనే రాళ్లు విసరడం.. ద్వేషం పెంచుకోవడం, రష్యా, చైనా మరింత దగ్గరవుతున్నాయని అసూయ పడడం ఇదే పని. భారత్‌కు భారీ వాణిజ్య లోటు ఉందని, భారత్ చర్యలతో అమెరికా లాస్ అవుతోందని అక్కసు వెళ్లగక్కడం. ఎవరైనా వింటే ట్రంప్ మాటలు నిజమనే అనుకుంటారు. అలా చెబుతుంటాడు ట్రంప్. కానీ జరిగేవన్నీ అందుకు విరుద్దం.
అమెరికాకు, చైనాతో 295.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. అదే యూరోపియన్ యూనియన్ తో 235.6 బిలియన్ డాలర్ల లోటు మెక్సికోతో 157.2 బిలియన్ డాలర్లు. వియత్నాంతో 113.1 బిలియన్ డాలర్లు. కెనడాతో 54.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే.. అమెరికాతో భారత్ వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లు. అంటే చైనా, ఈయూ, మెక్సికో, వియత్నాం, కెనడాలతో పోలిస్తే మనతో యూఎస్ వాణిజ్య లోటు గడ్డిపోచతో సమానం. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ గడ్డి పోచనే పట్టుకుని వేలాడుతున్నాడు.
వాణిజ్య లోటు ఎక్కువున్న చైనాపై 30 శాతం టారిఫ్ లు వేశారు ట్రంప్. అలాగే ఈయూపై 15 శాతం టారిఫ్ లతో సరిపెట్టారు. అదే మనపై మాత్రం 50 శాతం టారిఫ్ లు బాదేశారు. ఇందులో చైనా ప్రతీకార సుంకాలకు దిగడంతో ట్రంప్ 50 శాతం నుంచి వెనక్కు తగ్గి 30 శాతానికి తగ్గించాడు. మనం కూడా మన ఐటీ ఎక్స్ పోర్ట్స్, సర్వీసెస్ సెక్టార్ లో సహాయ నిరాకరణ చేస్తే గంటలో దిగి వస్తాడు ట్రంప్. అందరినీ ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడడం మన నైజం కాదు కాబట్టి ఆవేశంగా, భావోద్వేగాల ఆధారంగా భారత్ నిర్ణయాలు తీసుకోదు. కానీ టైం వస్తే తప్పదు.
2024లో భారత్-అమెరికా మధ్య వాణిజ్యం వాల్యూ 190 బిలియన్ డాలర్లు. వస్తువులు, సర్వీస్ సెక్టార్ కలిపి. వస్తువుల విషయానికొస్తే భారత్ ఎగుమతులు 87 బిలియన్ డాలర్లు ఉంటే.. అమెరికా నుంచి మన దేశానికి వచ్చే ఉత్పత్తుల వాల్యూ 45.3 బిలియన్ డాలర్లుగా ఉంది. సో ఇక్కడ వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లే. కానీ మనకన్నా ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలు ట్రంప్ కు మంచిగా కనిపిస్తున్నాయి. తక్కువ వాణిజ్య లోటు ఉన్న మనం కఠినంగా కనిపిస్తున్నాం ఇదేం లెక్క.
వస్తువుల వాణిజ్యంలో అమెరికా లోటులో ఉన్నప్పటికీ. సర్వీసెస్ ట్రేడ్ లో అమెరికాకు లాభం ఉంది. ఐటీ, సాఫ్ట్వేర్, ఇతర సేవలలో భారత్ అమెరికాకు గణనీయమైన ఎగుమతులు చేస్తుంది. దీంతో అమెరికా సర్వీసెస్ రంగంలో లాభం పొందుతోంది. దీంతో ట్రేడ్ దాదాపు ఈక్వల్ అయినట్లే. ఎందుకంటే భారత్ ఐటీ, సర్వీస్ సెక్టార్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఐటీ సంబంధిత సేవలు, BPO, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ రంగాల్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది.
భారత్ ఐటీ సేవలు అమెరికా కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ఐటీ సర్వీసెస్ తో అమెరికన్ కంపెనీలు లాభపడుతున్నది ట్రంప్ కళ్లకు కనిపించట్లేదా. TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికన్ కంపెనీలకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్ వంటి సేవలను అందిస్తున్నాయి. ఇవి అమెరికాలో అదే సేవలను అందించే కంటే చాలా తక్కువ. మరి ఇక్కడ కొంచెం కాదు భారీగా లాభపడుతున్నది అమెరికన్ కంపెనీలు కాదా ట్రంప్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మన ఐటీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ తోనే అమెరికన్ బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, రిటైల్ కంపెనీలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను సాధిస్తున్నాయి. 24X7 సర్వీసులు అందించగలుగుతున్నాయి. ఇండియన్ ఐటీ సేవలు అమెరికన్ కంపెనీల గ్లోబల్ సప్లై చైన్‌లో కీ రోల్ గా ఉన్నాయి. ఆ కంపెనీలు వరల్డ్ వైడ్ గా ఎఫెక్ట్ చూపుతున్నాయంటే భారతీయ ఐటీ సెక్టార్ కారణం. అంటే ఇక్కడ ట్రంప్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఒక ఉత్పత్తుల విషయాన్నే పట్టుకుని వేలాడితే లాభం లేదు.
మనవైపు నుంచి చాలా బెనిఫిట్స్ అమెరికాకూ వెళ్తున్నాయి. సో ట్రంప్ పరిస్థితి ఎంత జోకర్ గా మారిందంటే.. ట్రంప్ ఈజ్ డెడ్ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. తాను చావలేదు అని స్వయంగా వైట్ హౌజ్ ప్రెస్ మీట్ లో చెప్పుకోవాల్సి వచ్చింది ట్రంప్.
భారత్ పై సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే పాకిస్తాన్లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి డోనాల్డ్ ట్రంప్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్తాన్‌తో అమెరికా ఒక ఒప్పందం పూర్తి చేసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాశారు. ఇందులో భాగంగా రెండు దేశాలు కలిసి పాకిస్తాన్‌లోని భారీ చమురు నిల్వ కేంద్రాలు డెవలప్ చేస్తాయన్నారు. అమెరికా-పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జులైలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పోస్ట్ పెట్టారు.
మరి ఉన్నట్లుండి.. ట్రంప్ కు పాకిస్తాన్ పై ప్రేమ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ట్రంప్ కుటుంబంతో వాణిజ్యానికి పాకిస్థాన్ అంగీకరించింది కాబట్టే ఆయన భారత్‌ను పక్కన పెట్టారని అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల మాజీ సలహాదారు జేక్ సలీవాన్ అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ అసలైన లాజిక్స్ అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ అయితే ప్రతి దానికి తల ఊపుతుంది. ఆడించినట్లు ఆడుతుంది, మన లెక్క వేరు కాబట్టి అలా ట్రంప్ అటువైపు ఫోకస్ పెంచారు. పైగా పెద్దాయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది పాకిస్తాన్.
భారత్ పాక్ యుద్ధాన్ని స్వయంగా ఆపానని క్లెయిమ్ చేసుకున్నాడు ట్రంప్. మనం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఇందులో ట్రంప్ చేసిందేమీ లేదని భారత్ బహిరంగంగానే చెప్పింది. అది కూడా ట్రంప్ కు నచ్చలేదు. సో మనపై 50 శాతం టారిఫ్ ల వెనుక ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, వ్యక్తిగత ఇగోలే కారణమన్నది అమెరికన్ నిపుణులే చెబుతున్న మాట. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడానికి భారత ప్రధాని మోడీ తిరస్కరించారనే కారణంతో ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ట్రంప్ ఇదొక్కటే కాదు రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున డొనాల్డ్ ట్రంప్ WHO నుండి తప్పుకునేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అంతకు ముందు టర్మ్ లో UNESCO నుంచి అమెరికా బయటికొచ్చేలా చేశారు. చైనా ప్రభావం పెరుగుతోందని కారణం చూపారు.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ తో సహకారాన్ని తగ్గించేశారు. అంతెందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటికొస్తానని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు ట్రంప్. అయితే అమెరికా ఏ సంస్థ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదు… చూసుకుందాం అంటున్నాయి రష్యా, చైనా, భారత్.
మరి రైట్ ట్రంప్ తన రూట్లో తాను వెళ్తే భారత్, చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ ఓ స్ట్రాటజీ ఉంటుంది కదా. అందుకే మిగితా పవర్ ఫుల్ కంట్రీస్ ఒక్కటవుతున్నాయి. అమెరికా ఎంత రెచ్చిపోతే రష్యా మనకు అంత మేలు చేస్తోంది. మరింత తక్కువకే రష్యా చమురు అందిస్తోంది. బయటితో పోలిస్తే రష్యా చమురు బ్యారెల్‌కు సుమారు 3 నుంచి 4డాలర్ల వరకు చౌకగా లభిస్తోందంటున్నారు.
అమెరికా వార్నింగ్స్ ఇచ్చినా రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఇదంతా భారత్, రష్యా లోకల్ కరెన్సీల్లోనే జరుగుతుండడం మనకు ప్లస్ అవుతోంది. మనకు ఇంతకంటే ఏం కావాలి.
2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి ముందు, రష్యా ఏటా 150 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా గ్యాస్‌ను యూరప్‌కు ఎగుమతి చేసేది. అప్పుడు రష్యన్ గ్యాస్ ను కొనొద్దని ట్రంప్ ఈయూ దేశాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రష్యా ప్లాన్ బి చేస్తోంది. చైనాకు గ్యాస్ పైప్ లైన్ పై ముందడుగు వేసింది. సో ఏ లెక్కన చూసుకున్నా ట్రంప్ కు మతడ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు భారత్‌పై ఇప్పటివరకు టారిఫ్‌లతో రెచ్చిపోయిన ట్రంప్.. ఇప్పుడు మళ్లీ మోడీ నేను జానే జిగర్ అంటూ కవరింగులు చేస్తున్నాడు. ఏకంగా మోడీ తన ఫ్రెండ్ అంటూ ప్రపంచం ఎదుట చెబుతున్నారు. అంతేకాదు మోడీ గొప్ప ప్రధాని అంటూ కితాబు ఇచ్చారు. భారత్‌తో సంబంధాలపై ట్రూత్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసి అందరినీ అశ్చర్యానికి గురిచేశారు పెద్దన్న.
అమెరికాకు భారత్ దూరమైంది అంటూ గోడువెల్లబోసుకుంటున్నారు ట్రంప్. రష్యాతో చమురు కొనుగోలు తనను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. అయితే రష్యాతో చమురు కొనొద్దని మాత్రమే చెప్పాను.., అయినా భారత్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. అందుకే భారత్‌పై 50శాతం సుంకాలు విధించానంటూ వివరణ ఇచ్చుకున్నారు ట్రంప్.
మొత్తానికి చేతులు కాలక కాళ్లు పట్టుకున్నట్లు అయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. మరి చూడాలి ట్రంప్ వ్యవహార శైలి ఎక్కడివరకు వెళ్తుందో ఏం ఏం చేస్తుందో.



