జాతియం
Mock Drill: హైదరాబాద్, విశాఖలో మాక్ డ్రిల్.. కేంద్రం కీలక ఆదేశం

Mock Drill: పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల తెలుగు రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. దాడులు జరిగే ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరి -1లో ఢిల్లీ, తారాపూర్ అణుకేంద్రం, కేటగిరి -2లో హైదారబాద్, విశాఖ ప్రాంతాలు ఉన్నాయి.
తెలంగాణ లోని హైదరాబాద్, ఏపీ లోని విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం 3 కేటగిరీలుగా దేశంలోని మొత్తం 259 జిల్లాల్లో యుద్ధం ప్రభావం ఉంటుందని కేంద్ర హోంశాఖ అంచనా వేసింది.