ఆంధ్ర ప్రదేశ్
Talasila Raghuram: దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయండి

Talasila Raghuram: వైసీపీ పుట్టిదే ఉపఎన్నికల నుంచిని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే హక్కులేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు రెండున్నర ఏళ్లపాటు శాసనసభకు రాలేదన్నారు. దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయాలని, తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
పులివెందుల ఉపఎన్నికను రిఫరెండంగా ఒప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయిస్తామని కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. దానిపై సీఎం చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు.



