ఆంధ్ర ప్రదేశ్
MLC Nagababu: ఆర్టీసి కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు

MLC Nagababu: శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్సీ నాగబాబు హామీ ఇచ్చారు. రోజుకి 60 వేల మంది ప్రయాణించే బస్టాండ్‌లోని సమస్యలు తన దృష్టికి రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు జనసేన నేత నాగబాబు తెలిపారు. బస్‌స్టాండ్‌ను కొంచెం హైట్ లేపి 25 ప్లాట్‌ఫామ్‌లను 45 ప్లాట్‌ఫామ్స్‌కు పెంచితే బాగుంటుందని నాగబాబు అభిప్రాయపడ్డారు.
స్టాండ్‌ను పీపీపీ మోడ్‌లో అభివృద్ధి చేయాలనే ప్రపోజల్ ఉందని, శాసనమండలి సమావేశాల్లో శ్రీకాకుళం సమస్యలను ప్రస్తావిస్తానని నాగబాబు తెలిపారు. స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్ ప్రయాణo కల్పిస్తున్నామని, ఆర్టీసీ బస్టాండ్స్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే మరింత బాగుంటుందని నాగబాబు అన్నారు.



