తెలంగాణ
MLC Kavitha: కవిత కీలక నిర్ణయం.. 72 గంటలపాటు నిరాహార దీక్ష

MLC Kavitha: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు చర్చ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీ బిల్లు అమలు చేయాలని పట్టుబట్టిన ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4,5,6 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిరాహార దీక్ష చేయనున్నారు. బీసీ బిల్లు సాధించేందుకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.