తెలంగాణ
MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీ. రవీందర్ రావు, అలాగే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భారత్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ సస్పెన్షన్‌తో బీఆర్ఎస్ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.



