తెలంగాణ
MLC Kavitha: ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రజలు గ్రామ గ్రామానా నిలదీయాలి

MLC Kavitha: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ ఢిల్లీలో కలిసిమెలసి తిరుగుతున్నారని కవిత విమర్శించారు. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్‌లో చేరారా అని అనుమానం వచ్చిందన్నారు. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్‌రెడ్డితో మరొసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారని అన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రజలు గ్రామ గ్రామానా నిలదీయాలన్నారు.