MLC Kavitha: కాంగ్రెస్, బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha: కాంగ్రెస్, బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న మోసానికి నిరసనగా ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు.
బిల్లును ఆమోదించకపోతే రెండున్నర కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్ రోకోను నిర్వహిస్తామన్నారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. రైల్ రోకోకు మద్ధతు, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని తెలిపారు.