తెలంగాణ
MLC Kavitha: తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీ రామరక్ష

MLC Kavitha: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఎల్కతుర్తి సభ మరో మైలు రాయిగా నిలవబోతుందన్నారు. ఈనెల 27న ఎల్కతుర్తి మరో కుంభ మేళా కాబోతుందన్నారు. వంచించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలన్నారు.
ఆడ బిడ్డలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీయం కోసం అందరూ కలిసి రావాలన్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీ రామరక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు.