తెలంగాణ
MLC Kavitha: తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన కుమార్తె ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గులాబీ దళపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్‌తో ఆశీర్వాదం తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్ నందినగర్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో మాజీ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.