ఆంధ్ర ప్రదేశ్
పేర్ని నానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఓపెన్ ఛాలెంజ్

మాజీ మంత్రి పేర్ని నానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. తప్పుడు కేసులు పెట్టానని నాని చేసిన వ్యాఖ్యలకు తాను చర్చకు సిద్ధమని అన్నారు. వల్లభనేని వంశీయే కాదు గన్నవరంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తపై కూడా నేను తప్పుడు కేసులు పెట్టలేదన్నారు.
ప్రజలకు సేవ చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. నకిలీ పట్టాలు పంచినప్పుడు టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో మీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో ఉన్నప్పుడు తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని అన్నారు.