ఆంధ్ర ప్రదేశ్
Chintalapudi: ప్రవేట్ బస్సులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. బస్సులో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. రవాణాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల తనిఖీల్లో రవాణాశాఖ అధికారులు శ్రద్ధ కనబరచాలని.. నిబంధనలు పాటించని ట్రావెల్స్‌పై చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.
బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉన్నది స్పష్టంగా కనబడే విధంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమానులు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఎమర్జెన్సీ డోర్‌పై సూచికలు ఏర్పాటు చేయాలని బస్సు ట్రావెల్స్‌కు సూచించారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు.



