రష్యాలో అంగారా ఎయిర్‌లైనస్ విమానం అదృశ్యం

రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యమైంది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అమూర్ ప్రాంతంలో ఈ విమానం మిస్సింగ్ అయినట్లు తెలిసింది. విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఇప్పుడు అధికారులు ఈ విమానం ఏమైంది అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది టెక్నికల్ సమస్యా, లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది పరిశీలిస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా గమనిస్తున్నారు. మొత్తానికి ఈ విమానం మిస్సింగ్ అవ్వడం కలకలం రేపుతోంది. రష్యా-చైనా సరిహద్దుల్లో ఈ విమానం మిస్సింగ్ అవ్వడంతో అక్కడ పరిశీలిస్తున్నారు.
చైనాతో సరిహద్దు వద్ద ఉన్న అముర్ ప్రాంతంలోని టిండా పట్టణం వైపు ఈ విమానం దూసుకెళ్తోంది.అయితే టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే, విమానం గాలిలో మాయమైంది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఉన్న కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది.