తెలంగాణ
Miss World 2025 grand finale: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలు

Miss World 2025 grand finale: హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. అయితే నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త సుధారెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 72వ మిస్ వరల్డ్ ఫైనల్లో సుధారెడ్డికి ఈ గౌరవం లభించనుంది. ఇప్పటికే మెట్ గాలా, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పారిస్ ఒలింపిక్స్ వంటి విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సుధారెడ్డి గ్లోబల్ అంబాసిడర్‌గా నియామకమవ్వడం కేవలం వ్యక్తిగత గౌరవమే కాదు దేశానికి, తెలుగు మహిళల సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుగా నిలుస్తోంది. కాగా సుధారెడ్డి దాతృత్వానికి, నాయకత్వ దక్షతకు ఇదే నిజమైన గౌరవం. ఆమె మాతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా మార్పుకు కృషి చేయనున్నారని మిస్ వరల్డ్ ఛైర్పర్సన్ జూలియా మార్లీ అన్నారు.