తెలంగాణ
Hyderabad: భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను చితకబాదిన మహిళ

Hyderabad: భర్త ప్రశాంత్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను మరో మహిళ చితకబాదిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో చోటు చేసుకుంది. భర్త గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉండటంతో భార్య నిలదీసింది. ఫోన్ లో చాటింగ్ చూసిన కుటుంబ సభ్యులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
భార్య మాటలు విన్న భర్త ప్రశాంత్ గోడ దూకి పరారయ్యాడు. ఆ వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులను వ్యాపారంలో పెడతా అని చెప్పి 30 లక్షలు, కారు, స్కూటీ, బంగారం తీసుకెళ్లి వాణికి ఇచ్చాడని ప్రశాంత్ భార్య ఆరోపించింది. తనకి న్యాయం చేయాలని పోలీసులకి ఫిర్యాదు చేసింది బాధితురాలు.