తెలంగాణ
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రుల పర్యటన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరో పదేళ్లు అధికారంలో ఉంటామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.



