Thummala: అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి

Thummala: అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని బాలప్పేటలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.. 3 కోట్ల 95 లక్షలతో బల్లెపల్లి నుంచి బాలాపేట వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, ఇది వైద్య కళాశాలకు ఉపయోగపడుతుందని, రాబోయే రోజులలో అక్కడ కూడా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో నివాసాలు కోల్పోయే పేదలకు స్థలం, ఇంటి నిర్మాణం చేసి అందించాలని అన్నారు.నిరుపేదలకు ఇండ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
గతంలో వచ్చిన వరద పరిస్థితులు పునరావృతం కావద్దని 249 కోట్లతో డ్రైయిన్ పనులు శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని, వేసవికాలం లోపు పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి 8 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, దీనికి అనువైన స్థలాన్ని వెంటనే ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని మంత్రి కమీషనర్ కు సూచించారు.
సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం మౌళిక వసతుల కల్పనకు 8 కోట్ల 5 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు గణతంత్ర దినోత్సవం నాడు శంకుస్థాపన చేయాలని అన్నారు. ఖమ్మం నగరం పరిధిలో ఉన్న మున్సిపల్ పార్కులను శుభ్రం చేస్తూ, సాయంత్రం ప్రజలు ఆహ్లాదకరంగా గడిపే విధంగా ఏర్పాటు చేసేందుకు కోటి రూపాయలను మంజూరు చేస్తున్నామని, ఈ నిధులను సక్రమంగా వినియోగించాలని అన్నారు.