రాజకీయం వ్యవసాయంపై మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

Thummala: రాజకీయం వ్యవసాయంపై మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో.. రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం సహా రాజకీయ అంశాలను మంత్రి విశ్లేషించారు. అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టూరిజం రంగాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి కృషి చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి టెంపుల్ అభివృద్ధికి నోచు కోలేదన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో భద్రాద్రి టెంపుల్ పునరుద్ధరణతో పాటు విస్తరణ పనులు జరగుతున్నాయని తెలిపారు. రేవంత్పాలనలో ముందు తరాలకు తెలిసేలా సీతారామ ప్రాజెక్టు, భద్రాద్రి రామాలయం, ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్సాగు విస్తరణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.



