తెలంగాణ
Sridhar Babu: 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం

Sridhar Babu: తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను, బదిలీలను, కొత్త నియమాకాలను చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
బీసీలను 42 శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను విస్మరించిందని రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు మంథనిలో అన్నారు.



