తెలంగాణ
అమీర్‌పేట్ అగ్రసేన్ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ.. ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల సేవలను అందిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అగ్రసేన్ బ్యాంక్ అమీర్ పేట్ బ్రాంచ్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
దేశార్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం. ముఖ్యంగా అట్టడుగువర్గాలకు ఆర్థిక సేవలను అందించడంలో ఇవి ముందున్నాయి. RBI వార్షిక నివేదిక 2024 ప్రకారం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మందికి పైగా ప్రజలు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం డిపాజిట్లు, రుణాలు 5.5 లక్షల కోట్ల మార్కును దాటాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.