తెలంగాణ
మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

Seethakka: ములుగులో మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ మరణాన్ని రాజకీయం చేయొద్దని మంత్రి సీతక్క కోరారు. కొందరు పనిగట్టుకుని అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. మహేష్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
4లక్షల విలువైన ఫిక్స్ డిపాజిట్ బాండును అందజేశారు. మహేష్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, ఒకరిని విధులనుంచి శాశ్వతంగా తొలగించగా, మరొకరిని సస్పెండ్ చేశామని చెప్పారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.



