తెలంగాణ
Medaram: మేడారం గద్దెల పునః ప్రతిష్టాపన

Medaram: ములుగు జిల్లాలోని మేడారంలో నూతన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల పునఃప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వంశీయులు తదితరులు పాల్గొన్నారు.



