తెలంగాణ
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఆయన సోదరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. మంత్రి సీతక్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ బట్టలు పెట్టారు. రాఖీ పండుగ అన్న చెల్లెలు,అక్క తమ్ముళ్ల అనుబంధాన్ని ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.



