తెలంగాణ
కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ

Seethakka: కేంద్ర మహిళా శిశు సంక్షమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్రమంత్రికి మంత్రి సీతక్క వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలను కేంద్రమంత్రికి సీతక్క వివరించారు.
ఆరోగ్య లక్ష్మీ, పోషన్ 2.0, అంగన్ వాడీ పథకాల ద్వారా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇస్తున్న జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు.