తెలంగాణ
జంపన్న వాగు పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. ఎప్పటికప్పుడు స్నాన ఘట్టాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
కొంగల మడుగు నుండి జంపన్న వాగుకు వెళ్ళే రోడ్డు పనులలో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పనులను, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాన్ని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రైవేట్ వాహనాల మార్గాలను పరిశీలించారు.



