తెలంగాణ
Seethakka: డీజే పాటలకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క

Seethakka: ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ, ఐపీఎస్ ల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యువత భారీగా హాజరయ్యారు. ఇందులో భాగంగా డీజే పాటలకు మంత్రి సీతక్క, బలరాం నాయక్, ఎస్పీ శభరీష్.. యువతతో కలిసి డీజే పాటలకు ఫుల్ జోష్ తో స్టెప్పులేశారు.
అనంతరం 3కే రన్ నిర్వహించి.. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యత అని.. ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతను పాటించాలని సీతక్క సూచించారు.