తెలంగాణ
Seethakka: బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్

Seethakka: కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కరెప్షన్ వైరస్ సోకిందన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో… సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలన్నారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలంటున్నారు .
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పదేళ్లుగా బిజెపికి అధికారం ఇస్తే గ్రామాల్లోకి అక్షింతలు వచ్చాయి తప్ప అభివృద్ధి రాలేదని సీతక్క విమర్శించారు. బీజేపీ మతం పేరుతో దేవుని పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టాలని చూస్తుందని ఆరోపణలు చేశారు.